అఖండ–2 చిత్ర యూనిట్ శ్రీశైలం దేవస్థానాన్ని దర్శించుకుంది. డైరెక్టర్ బోయపాటి శ్రీను, సంగీత దర్శకుడు తమన్‌తో పాటు టీమ్ సభ్యులు మల్లికార్జున స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సినిమా ఘన విజయాన్ని సాధించాలని ప్రార్థనలు చేశారు. కాగా, అఖండ–2 గ్రాండ్ ప్రీమియర్ షోలు ఈరోజు రాత్రి 9 గంటలకు దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి.