
చంద్రబాబు, లోకేశ్ కృషి వల్లే గూగుల్ డేటా సెంటర్: MP శ్రీభరత్
సీఎం చంద్రబాబు నాయుడు, లోకేశ్ ల కృషితోనే విశాఖలో గూగుల్ డేటా సెంటర్ వచ్చిందని ఎంపీ శ్రీభరత్ అన్నారు. భవిష్యత్తులో విశాఖ మరింత అభివృద్ధి చెందుతుందని, మరిన్ని సంస్థలు ఇక్కడకు రానున్నాయని ఆయన పేర్కొన్నారు. సమర్థ నాయకత్వంతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు.




