అక్షయ తృతీయ: రూ.50 వేల వరకు డిస్కౌంట్‌‌తో ఓలా సోనా వీకెండ్‌!

57చూసినవారు
అక్షయ తృతీయ: రూ.50 వేల వరకు డిస్కౌంట్‌‌తో ఓలా సోనా వీకెండ్‌!
అక్షయ తృతీయ సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ 'ఓలా సోనా వీకెండ్‌' పేరుతో ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ వారాంతంలో అన్ని విద్యుత్ వాహనాలపై రూ.50 వేల వరకు డిస్కౌంట్‌ అందిస్తోంది. కొత్త వాహనాల కొనుగోలుపై రూ.40 వేల వరకు ప్రయోజనాలు, కొన్ని క్రెడిట్ కార్డులపై రూ.10 వేల అదనపు డిస్కౌంట్‌ లభిస్తుంది. జెన్‌ 3 ఎస్‌1 ఎక్స్‌ X (2kWh), రోడ్‌స్టర్‌ ఎక్స్‌ (2.5 kWh) వాహనాల ప్రారంభ ధర రూ.49,999గా నిర్ణయించారు. రోడ్‌స్టర్‌ X+ 9.1 kWh బైక్‌పై రూ.50 వేల డిస్కౌంట్‌తో రూ.1,39,999కే పొందవచ్చు. కొనుగోలు చేసిన వాహనాలకు 8 ఏళ్ల బ్యాటరీ వారెంటీతో పాటు, లక్కీ డ్రా విజేతకు ఓలా సోనా స్పెషల్ ఎడిషన్‌ను బహుమతిగా అందిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్