అయ్యో పాపం.. రేబిస్ సోకి మూడేళ్ల బాలుడు మృతి

143చూసినవారు
అయ్యో పాపం.. రేబిస్ సోకి మూడేళ్ల బాలుడు మృతి
మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇంటి బయట ఆడుకుంటున్న మూడేళ్ల ఆర్మాన్‌ను వీధి కుక్క గాయపరిచింది. తాను పడిపోయానని చెప్పడంతో తల్లిదండ్రులు విషయం గ్రహించలేదు. ఎనిమిది రోజుల తర్వాత గాయం బయటపడగా అప్పటికే రేబిస్ సోకింది. మూడు ఆసుపత్రులు చికిత్సకు నిరాకరించగా పది రోజుల తర్వాత ఆ బాలుడు మరణించాడు. వీధి కుక్కలపై చర్యలు తీసుకోవాలని కుటుంబం డిమాండ్ చేసింది.

సంబంధిత పోస్ట్