అలర్ట్: SBI కస్టమర్లకు వాట్సాప్ ద్వారా నకిలీ సందేశాలు

0చూసినవారు
అలర్ట్: SBI కస్టమర్లకు వాట్సాప్ ద్వారా నకిలీ సందేశాలు
SBI యోనో యాప్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని బ్యాంక్ హెచ్చరించింది. "వాట్సాప్ ద్వారా ‘ఆధార్ అప్‌డేట్ చేయకపోతే ఖాతా బ్లాక్ అవుతుంది’ అంటూ నకిలీ సందేశాలు పంపిస్తూ APK ఫైల్ డౌన్‌లోడ్ చేయమని సైబర్ నేరస్థులు మోసం చేస్తున్నారు. అలాంటి ఫైల్స్ డౌన్‌లోడ్ చేస్తే ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి సందేశాలను SBI ఎప్పుడూ పంపదని స్పష్టం చేసింది. సందేశాలు వచ్చిన వెంటనే నంబర్ బ్లాక్ చేసి బ్యాంక్‌కు తెలియజేయాలి. డబ్బు పోయితే వెంటనే 1930 హెల్ప్‌లైన్ లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలి" అని సూచించింది.

సంబంధిత పోస్ట్