ఎల్‌పీజీ గ్యాస్ సరఫరాలో మే1 నుంచి మార్పులు జరగనున్నాయి. నగరాల్లో నివసించే వారు ఒక బుకింగ్‌కు, మరో బుకింగ్‌కు మధ్య కనీసం 25 రోజుల విరామం పాటించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ గడువు 45 రోజులుగా నిర్ణయించారు. ఇక గ్యాస్ డెలివరీ సమయంలో OTP ఆధారిత ప్రామాణీకరణ ఇకపై తప్పనిసరి కానుంది. అలాగే ప్రస్తుతం 98% బుకింగ్‌లు ఆన్‌లైన్ ద్వారానే జరుగుతుండగా, మే నెల నుంచి డెలివరీ వ్యవస్థను మరింత డిజిటలైజ్ చేయనున్నారు.