TG: హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని ఖాజాగూడ ప్రాంతంలో పైప్‌లైన్ పనుల కారణంగా సెప్టెంబర్ 26 నుంచి 60 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. కిమ్స్ ఆస్పత్రి నుంచి నానక్‌రామ్‌గూడ వైపు వెళ్లే సర్వీస్ రోడ్డు, ఫ్రీ-లెఫ్ట్ పూర్తిగా మూసివేయబడతాయి. బయోడైవర్సిటీ జంక్షన్ వైపు నుంచి నానక్‌రామ్‌గూడ రోడ్డు వైపు రైట్ టర్న్ కూడా నిలిపివేయబడుతుంది. ఐటీ ఉద్యోగులు, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు.