AP: తిరుమల భక్తులకు శుభవార్త. టీటీడీ పరిధిలోని ఆలయాలలో ఇకపై తిరుమల తరహాలో రుచికరమైన అన్నప్రసాదాలు అందించనున్నట్లు ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ప్రకటించారు. ప్రస్తుతం 15 ఆలయాల్లో కొనసాగుతున్న అన్నప్రసాద సేవను ఈ నెల 31వ తేదీ నుంచి మరో 19 ఆలయాలకు విస్తరించనున్నారు. మిగిలిన 26 ఆలయాల్లో 2026 ఫిబ్రవరి 28 నుంచి సేవ ప్రారంభం కానుందని తెలిపారు. ఈ మేరకు పోటు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.