TG: నైరుతి రుతుపవనాల కదలికలు చురుగ్గా మారడంతో తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేడు ములుగు, భద్రాద్రి, KMM జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం నుంచి వర్షాల తీవ్రత పెరుగుతుందని అంచనా వేసింది. ADLB, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, MBBD, WGL, హనుమకొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని తెలిపింది.