నవంబర్ 1 నుంచి దేశ ప్రజలకు బ్యాంకింగ్, ఆధార్ నమోదు విషయంలో కొత్త నియమాలు అమలులోకి రానున్నాయి. ఇకపై ఇంటి నుంచే మొబైల్ ద్వారా ఆధార్ అప్‌డేట్ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి రానుంది. దీనికి రూ.75 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా, బ్యాంక్ ఖాతాలు, లాకర్ల కోసం నలుగురు నామినీలను పెట్టుకునే అవకాశాన్ని ఆర్‌బీఐ కల్పించింది. ఎస్‌బీఐ థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా విద్యా చెల్లింపులు, రూ.1000కి మించిన వాలెట్ రీఛార్జ్‌లపై నవంబర్ 1 నుంచి 1 శాతం ఫీజు వసూలు చేయనుంది.