ఇరాక్ కొత్త ప్రధానిగా అలీ అల్-జైదీ

12చూసినవారు
ఇరాక్ కొత్త ప్రధానిగా అలీ అల్-జైదీ
ఇరాక్ రాజకీయాల్లో కీలక మార్పు చోటుచేసుకుంది. కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు నిజార్ అమేడే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో వ్యాపారవేత్త అలీ అల్-జైదీని దేశ ప్రధానమంత్రిగా నియమించారు. ఇరాన్ మద్దతు ఉన్న నూరి అల్-మాలికిని ప్రధానిగా చేస్తే ఆర్థిక, సైనిక సహాయం నిలిపివేస్తామని ట్రంప్ హెచ్చరించడంతో, ఇరాక్ నాయకత్వం ప్రత్యామ్నాయ అభ్యర్థిగా అలీ అల్-జైదీని ఖరారు చేసింది. 40 ఏళ్ల జైదీ, ఇరాక్ చరిత్రలోనే అతి పిన్న వయస్కుడైన ప్రధానిగా నిలిచే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్