ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతితో హైదరాబాద్ పాతబస్తీలో నిరసనలు వెల్లువెత్తాయి. పురాని హవేలీలోని తంజీమ్ ఈ జాఫెరీ సంస్థ సంతాప నిరసన చేపట్టింది. భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చిన ముస్లింలు ఇజ్రాయెల్, అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పాతనగరంలో తీవ్ర రాకపోకల అంతరాయం ఏర్పడింది. ఖమేనీ మృతిపై హైదరాబాద్‌లో నిరసనలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.