మరో వారంలో తెలంగాణలోని అన్ని డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్‌!

16973చూసినవారు
మరో వారంలో తెలంగాణలోని అన్ని డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్‌!
TG: రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలు అక్టోబర్ 13 నుంచి మూతపడనున్నాయని తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల నిర్వహణ సంఘం తెలిపింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. గతంలో రూ.900 కోట్లు హామీ ఇచ్చి.. కేవలం రూ.300 కోట్లు మాత్రమే చెల్లించారని, మిగిలిన బకాయిలు అక్టోబర్ 12 నాటికి విడుదల చేయాలని అసోసియేషన్ అధ్యక్షుడు తెలిపారు. లేదంటే అన్ని కాలేజీలు మూసివేయబడతాయని హెచ్చరించారు.