TG: రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉన్నందున కరవు మండలాలను ప్రకటించి తగిన సాయం అందించాలని కేంద్రాన్ని తెలంగాణ కేబినెట్ కోరింది. త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడంతో పాటు ఢిల్లీకి మంత్రుల బృందం వెళ్లి కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా సుమారు 7,800 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.