కేబినెట్ భేటీ అనంతరం సీఎం రేవంత్ సంచలన ప్రకటన చేశారు. జనవరి 26న అన్ని పథకాలు అమలు చేస్తామని వెల్లడించారు. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా కింద ఏడాదికి ఒక ఎకరానికి రూ.12 వేలు ఇవ్వలని నిర్ణయించినట్లు తెలిపారు. భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు ప్రతి ఏటా రూ.12 వేలు ఇస్తామన్నారు. కొత్త పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పేరిట భూమిలేని కుటుంబాలకు ఆర్థికసాయం అందిస్తామన్నారు.