కరిచే కుక్కలంతా పార్లమెంట్‌లో ఉన్నారంటూ.. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఎంపీ తన కారులో తన పెంపుడు కుక్కని తీసుకుని పార్లమెంట్ భవనానికి వెళ్లారు. పెంపుడు కుక్కను తీసుకురావడంపై బీజేపీ ఎంపీలు విమర్శలు చేశారు. దీనికి కౌంటర్‌గా 'అది కరిచే కుక్క కాదు.. కరిచే వాళ్లంతా లోపల ఉన్నారు' అంటూ వ్యాఖ్యానించారు.