పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ పర్యటనలో కొబ్బరి పంటల నష్టానికి తెలంగాణ దిష్టి తగిలిందేమోనని వ్యాఖ్యానించినసంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా జనసేన నేత రాయపాటి అరుణ దీనిపై స్పందిస్తూ.. ‘పనికిరాని వాళ్లు అంటూ ఓకింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ మళ్ళీ చల్లబడ్డారు. వీరంతా ఎలా పెద్ద మనుషులు అయిపోయారు’ అంటూ నిట్టూర్చారు.