ఆ ముగ్గురూ జైలుకు వెళ్లక తప్పదు: రాజగోపాల్ రెడ్డి

5145చూసినవారు
ఆ ముగ్గురూ జైలుకు వెళ్లక తప్పదు: రాజగోపాల్ రెడ్డి
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 'కేసీఆర్‌ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు రాష్ట్రాన్ని నిలువునా దోచుకున్నారు. రానున్న రోజుల్లో కేసీఆర్, కేటీఆర్‌‌లతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి మంత్రిగా పని చేసిన జగదీశ్వర్ రెడ్డి కూడా జైలుకు వెళ్లక తప్పదు. తమ ప్రభుత్వం ఏమాత్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం లేదు' అని అన్నారు.