గతంలో ఎన్నడూ లేని స్థాయిలో.. భారత్‌ ఆయుధాల ఉత్పత్తి

2చూసినవారు
గతంలో ఎన్నడూ లేని స్థాయిలో.. భారత్‌ ఆయుధాల ఉత్పత్తి
కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం, దేశీయంగా రక్షణ ఉత్పత్తుల తయారీ విలువ 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.1.78 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది ఆల్ టైమ్ రికార్డు. 2013-14లో రూ.43 వేల కోట్లుగా ఉన్న ఈ విలువ దాదాపు నాలుగు రెట్లు పెరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఆత్మ నిర్భర్ భారత్ పిలుపుతో దేశీయ రక్షణ ఉత్పత్తుల తయారీ సరికొత్త మైలురాయిని అధిగమించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 15.6 శాతం ఎక్కువ, 2020-21తో పోలిస్తే ఐదేళ్లలో 110 శాతం వృద్ధి నమోదైంది.

సంబంధిత పోస్ట్