'అల్లాకు రక్తం అవసరం లేదు’.. నటి సారా ఖాన్ పోస్ట్ వైరల్

0చూసినవారు
'అల్లాకు రక్తం అవసరం లేదు’.. నటి సారా ఖాన్ పోస్ట్ వైరల్
బక్రీద్ సందర్భంగా హిందీ నటి సారా ఖాన్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అయింది. పండుగను జంతు బలులకు పరిమితం చేయకుండా మానవత్వం, దయ, సేవా కార్యక్రమాల సందేశాన్ని గుర్తుంచుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. "అల్లాకు మాంసం, రక్తం అవసరం లేదు. ఆయన మనలోని తఖ్వా (దైవ భీతి), కరుణ, విధేయతను మాత్రమే చూస్తారు" అని ఆమె పేర్కొన్నారు. జంతువులను బలి ఇవ్వడం కంటే ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం, పేదలకు సహాయం చేయడం గొప్పదని, మనలోని అహంకారాన్ని త్యజించి మంచి మనసుతో జీవించడమే నిజమైన ఖుర్బానీ అని ఆమె అభిప్రాయపడ్డారు.

సంబంధిత పోస్ట్