అత్యాచారం కేసులో అరెస్టైన
కాంగ్రెస్ ఎంపీ రాకేష్ రాథోర్‌ను అలహాబాద్ కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. యూపీలోని సీతాపూర్ నియోజకవర్గానికి ఎంపీగా ఉన్న రాకేష్ రాథోర్ 2020లో తనపై అత్యాచారం చేశారని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించారని 2025 జనవరిలో ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో అత్యాచారం కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు వీరిద్దరు పరస్పర అంగీకారంతోనే దీర్ఘకాలం వివాహేతర సంబంధం కొనసాగించారని కోర్టు గ్రహించింది. ఇతర సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు.. సదరు మహిళ చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవని ఈ తీర్పు ఇచ్చింది.