పశ్చిమబెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీపై సిలిగురి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై వివాదాస్పద ఆరోపణలు చేశారని ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు. జూన్ 2న కోల్‌కతాలో జరిగిన నిరసన సభలో, బంగ్లాదేశ్ జాతీయుడు ఉస్మాన్ హాది హత్య వెనుక కేంద్ర హోం శాఖ ప్రమేయం ఉందని మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు
భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతలను పెంచుతాయని, అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠను దిగజార్చుతాయని న్యాయవాది రింకీ సేన్ ఛటర్జీ ఆరోపించారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి రెచ్చగొట్టేలా మాట్లాడటం చట్టవిరుద్ధమని ఆమె పేర్కొన్నారు.