
గుడ్ న్యూస్.. రూ.47,000 వరకు తగ్గిన మారుతి సుజుకి ఎర్టిగా ధరలు
కేంద్రం జీఎస్టీ తగ్గించిన తర్వాత మారుతి సుజుకి ఎర్టిగా కార్ల ధరలను గణనీయంగా తగ్గించింది. సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి వచ్చిన కొత్త GST నిబంధనల ప్రకారం, ఎర్టిగా MPV అన్ని వేరియంట్లలో రూ. 47,000 వరకు చౌకగా మారింది. మాన్యువల్ వేరియంట్ల ధరలు రూ. 8.80 లక్షల నుండి రూ. 11.83 లక్షల మధ్య ఉండగా, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్ల ధరలు రూ. 11.20 లక్షల నుండి రూ. 12.94 లక్షల మధ్య ఉన్నాయి. CNG వేరియంట్ల ధరలు కూడా రూ. 40,000 నుండి రూ. 42,000 వరకు తగ్గాయి.




