ఒకప్పుడు హీరోయిన్‌గా రాణించిన ఆమని, ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్ గురించి, సినీ పరిశ్రమలోని స్నేహబంధాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 'మిస్టర్ పెళ్లాం', 'శుభ సంకల్పం' చిత్రాలకు నంది అవార్డులు, 'శుభలగ్నం' చిత్రానికి ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నానని తెలిపారు. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు వివాహం కారణంగా బ్రేక్ తీసుకోవాల్సి వచ్చిందని, మంచి పాత్రలను కోల్పోయానని, నటిగా ఎప్పటికీ సంతృప్తి ఉండదని, మరిన్ని మంచి పాత్రలు చేయాలనిపిస్తుందని ఆమె అన్నారు.