క్రాకర్స్ పేలుడు ఘటన.. 8కి చేరిన మృతుల సంఖ్య

13961చూసినవారు
క్రాకర్స్ పేలుడు ఘటన.. 8కి చేరిన మృతుల సంఖ్య
AP: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాయవరం సమీపంలోని శ్రీగణపతి ఫైర్ వర్క్స్ క్రాకర్స్ తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మంది సజీవ దహనమయ్యారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. మందుగుండు తయారు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. రాయవరం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్