
రైలులో మద్యం సేవించి దురుసుగా ప్రవర్తిస్తే జైలు శిక్ష!
రైళ్లలో మద్యం సేవించి దురుసుగా ప్రవర్తించే వారికి కఠిన శిక్షలు తప్పవు. రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 145 ప్రకారం.. మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించినా, అసభ్య పదజాలం ఉపయోగించినా గరిష్టంగా 6 నెలల జైలు శిక్ష లేదా రూ.500 వరకు జరిమానా విధించవచ్చు. మొదటి నేరానికి రూ.100 జరిమానా, రెండవ నేరానికి ఒక నెల జైలు శిక్ష, రూ.250 జరిమానా విధిస్తారు. ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తే రైల్వే సిబ్బంది చర్యలు తీసుకుంటారు.




