
దక్షిణాఫ్రికాలో కాల్పుల కలకలం.. 11 మంది మృతి
దక్షిణాఫ్రికాలోని డర్బన్ టౌన్షిప్లో దారుణ ఘటన జరిగింది. ఓ ఇంట్లోకి సాయుధులు చొరబడి కాల్పులు జరపడంతో గర్భిణితో సహా 11 మంది మృతి చెందారు. మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు క్వాజులు-నటాల్ ప్రావిన్స్ అధికారులు తెలిపారు. దాడికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. దుండగులు బాధితులను ఒక గదిలోకి తీసుకెళ్లి కాల్చినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




