జ్ఞాపకశక్తి పెంచే అద్భుత వ్యాయామం!

15937చూసినవారు
జ్ఞాపకశక్తి పెంచే అద్భుత వ్యాయామం!
పిట్స్‌బర్గ్, ఇల్లినాయిస్, రైస్, ఒహియో స్టేట్ విశ్వవిద్యాలయాల పరిశోధన ప్రకారం రోజూ 40 నిమిషాలు నడక జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. PNAS‌లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో 120 మంది వృద్ధులను 2 గ్రూపులుగా విభజించి, ఒక గ్రూపుని వారానికి మూడుసార్లు నడిపించారు. ఏడాది తర్వాత MRIలో నడిచిన వారిలో హిప్పోకాంపస్ వాల్యూమ్ పెరిగి, జ్ఞాపకశక్తి మెరుగుపడింది. నడక హృదయ ఆరోగ్యం, బరువు నియంత్రణ, కండర బలం, ఒత్తిడి తగ్గుదల, మధుమేహం, రక్తపోటు నియంత్రణకు కూడా సహాయపడుతుంది.

సంబంధిత పోస్ట్