
మహిళల ప్రపంచ కప్.. భారత్ - పాక్ చేతులు కలుపుతారా..?
ఈనెల 5న కొలంబోలో ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో భారత్ - పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. గత ఆసియా కప్ 2025లో పురుషుల జట్ల మధ్య భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో చేతులు కలపకపోవడం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో మహిళా జట్టు కూడా అదే వైఖరిని అనుసరిస్తుందా ? అనే ప్రశ్న తలెత్తింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు టాస్, మ్యాచ్ తర్వాత చేతులు కలపడం ఉండదని, మహిళా జట్టు కూడా పురుషుల జట్టు విధానాన్ని పాటిస్తుందని ఓ బీసీసీఐ అధికారి స్పష్టం చేశారు.




