
NFCలో ఉద్యోగాలు.. టెన్త్, ఐటీఐ పాసైతే చాలు!
హైదరాబాద్లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (NFC) వివిధ విభాగాల్లో 405 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, అటెండెంట్ ఆపరేటర్ (కెమికల్ ప్లాంట్), ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, డ్రాఫ్ట్స్ మెన్ (మెకానికల్), కార్పెంటర్, ప్లంబర్, వెల్డర్ వంటి పలు విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తులకు నవంబర్ 15 చివరి తేదీ. పూర్తి వివరాలకు NFC అధికారిక వెబ్సైట్లో చూడవచ్చు.




