ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


IPS ఆఫీసర్ సూసైడ్ కేసులో ట్విస్ట్.. DGPని అరెస్ట్ చేయాలని భార్య డిమాండ్
Oct 09, 2025, 11:10 IST/

IPS ఆఫీసర్ సూసైడ్ కేసులో ట్విస్ట్.. DGPని అరెస్ట్ చేయాలని భార్య డిమాండ్

Oct 09, 2025, 11:10 IST
హర్యానా అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వై. పురాణ్ కుమార్ ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. తన భర్త ఆత్మహత్యకు హర్యానా డీజీపీ శత్రుజిత్ సింగ్ కపూర్, రోహ్‌తక్ ఎస్పీ నరేంద్ర బిజర్నియాలే కారణమని పురాణ్ కుమార్ భార్య IAS అధికారిణి అమ్నీత్ పి. కుమార్ ఆరోపించారు. వారిని తక్షణమే అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు చండీగఢ్ పోలీసులకు అమ్నీత్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అక్టోబర్ 7 చండీగఢ్‌లోని తమ నివాసంలో పురాణ్ కుమార్ సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.