
అఫ్ఘనిస్థాన్‌లో భారీ వరదలు.. 17 మంది మృతి (వీడియో)
అఫ్ఘనిస్థాన్‌లో డిసెంబర్ 29 నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదల్లో 17 మంది మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు. ఉత్తర, దక్షిణ, పశ్చిమ, మధ్య ప్రాంతాల్లో ఎక్కువగా నష్టం జరిగింది. హెరాత్ ప్రావిన్స్‌లోని కబ్కాన్ జిల్లాలో ఇంటి పైకప్పు కూలి ఐదుగురు కుటుంబ సభ్యులు, ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. 1800 కుటుంబాలు ప్రభావితమయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.




