అద్భుత దృశ్యం.. శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం

47చూసినవారు
అద్భుత దృశ్యం.. శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం
AP: నెల్లూరు జిల్లా చెర్లోపల్లి రైల్వే గేటు వద్ద ఉన్న విశ్వనాథస్వామి ఆలయంలో ఆదివారం సాయంత్రం ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. కార్తికమాసం సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తున్న టైంలో శివలింగం వద్ద నాగుపాము ప్రత్యక్షమై కొద్దిసేపు పడగ విప్పి కనిపించిందని ఆలయ అర్చకుడు శ్రీనివాసులు తెలిపారు. అనంతరం ఆ పాము ఆలయం వెనుక ఉన్న పుట్టలోకి వెళ్లిపోయిందన్నారు. ఈ సంఘటనను భక్తులు శుభసూచకంగా భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్