
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు: వాతావరణశాఖ
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రానున్న నాలుగు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నాగర్ కర్నూల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మరోవైపు ఏపీలోనూ మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వెల్లడించింది. కడప, చిత్తూరు, తిరుపతి సహా పలు జిల్లాల్లో వానలు కురుస్తాయని, పిడుగుపాటు హెచ్చరికలు కూడా జారీ చేసింది.




