అమెజాన్ ప్రైమ్‌కు షాక్.. ఫెడరల్ కోర్టులో కేసు వేసిన ఆస్ట్రేలియా

13937చూసినవారు
అమెజాన్ ప్రైమ్‌కు షాక్.. ఫెడరల్ కోర్టులో కేసు వేసిన ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియాలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోపై ఆస్ట్రేలియా కాంపిటీషన్‌ అండ్‌ కన్జ్యూమర్‌ కమిషన్‌ ఫెడరల్ కోర్టులో దావా వేసింది. వినియోగదారులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా వాణిజ్య ప్రకటనలను ప్రవేశపెట్టడం, వాటిని నివారించడానికి అదనపు రుసుము వసూలు చేయడం వంటి నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిందని ఆరోపించింది. నవంబర్ 2023 నుంచి ఆగస్టు 2025 మధ్య దాదాపు 10 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ప్రభావితమయ్యారని కమిషన్ తెలిపింది. వినియోగదారులకు నష్టపరిహారం చెల్లించాలని కోరింది.

సంబంధిత పోస్ట్