ఇరాన్‌పై అమెరికా మళ్లీ దాడులు

61చూసినవారు
ఇరాన్‌పై అమెరికా మళ్లీ దాడులు
ఇరాన్‌పై అమెరికా మరోసారి దాడులు నిర్వహించింది. ఖేష్మ్, గోరుక్ ప్రాంతాల్లో ఉన్న డ్రోన్, రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా వైమానిక దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు, ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్