ఇరాన్‌తో యుద్ధంలో డ్రోన్ దాడుల నేపథ్యంలో
అమెరికా తన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు భారీగా చౌకబారు డ్రోన్లను కొనుగోలు చేయనుంది. ఇందుకోసం రూ.5 లక్షల కోట్లు వెచ్చించనుంది. వివిధ స్టార్టప్‌లకు నిధులు సమకూర్చడంతో పాటు, పెంటగాన్‌కు అవసరమైన డ్రోన్లను తయారుచేసే సంస్థలను ఎంపిక చేసేందుకు 'డ్రోన్ డామినెన్స్' పేరుతో పోటీ నిర్వహిస్తోంది. ఈ పోటీ ద్వారా 1.1 బిలియన్ డాలర్లతో 3,00,000 డ్రోన్లను తయారు చేయిస్తోంది. కాలిఫోర్నియాకు చెందిన నీరోస్, బ్రిటన్‌కు చెందిన స్కైకట్టర్ కంపెనీలు ఈ రేసులో ముందున్నాయి.