
కూకట్‌పల్లిలో TG SAFE దాడులు.. 5 సంస్థల లైసెన్సులు సస్పెండ్
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో TG SAFE బృందాలు 20 ఆహార సంస్థల్లో తనిఖీలు నిర్వహించాయి. ఈ దాడుల్లో తీవ్ర పరిశుభ్రత లోపాలు, పాడైపోయిన ఆహార పదార్థాలు, బొద్దింకలు, ఎలుకల సంచారం గుర్తించారు. లైసెన్స్ లేకుండా నడుస్తున్న GVK లగ్జరీ పీజీ మెన్స్ హాస్టల్‌ను మూసివేశారు. తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిన 5 సంస్థల ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సులను సస్పెండ్ చేశారు. కల్తీ అనుమానంతో 20 ఆహార శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు తరలించారు. నిబంధనలు పాటించని మరికొన్ని సంస్థలకు షోకాజ్, ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేశారు.




