అమెరికా మహిళల బాక్సింగ్‌లో రాణిస్తున్న హన్నా రాప్(26) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. శనివారం(జులై 18) టెక్సాస్‌లో సైకిల్ తొక్కుతుండగా ఓ కారు ఆమెను బలంగా ఢీకొట్టింది. దాంతో, తీవ్రంగా గాయపడిన హన్నా ప్రాణాలు కోల్పోయింది. బాక్సర్ మృతికి కారణమైన కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.