అమెరికన్ చెస్ గ్రాండ్‌మాస్టర్ కన్నుమూత

11204చూసినవారు
అమెరికన్ చెస్ గ్రాండ్‌మాస్టర్ కన్నుమూత
అమెరికన్ చెస్ గ్రాండ్ మాస్టర్ డానియెల్ నరోడిట్స్కీ (29) కన్నుమూశారు. టాలెంటెడ్ చెస్ ప్లేయర్, ఎడ్యుకేటర్, చెస్ కమ్యూనిటీలో ప్రియమైన సభ్యుడు తుదిశ్వాస విడిచారని నార్త్ కరోలినాలోని చార్లెట్ చెస్ క్లబ్ తెలిపింది. ఆయన మృతికి గల కారణాలు వెల్లడించలేదు. 18 ఏళ్లకే డానియెల్ గ్రాండ్ మాస్టర్ హోదా సాధించారు. ఆయన అండర్-12 వరల్డ్ ఛాంపియన్షిప్ నిలిచారు. కాగా డానియెల్ మరణ వార్త చెస్ ప్రపంచాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. తోటి గ్రాండ్‌మాస్టర్లు, అభిమానులు, చెస్ సంస్థల సంతాపం ప్రకటించాయి.

సంబంధిత పోస్ట్