అమెరికాలో వలసల నియంత్రణ లక్ష్యంగా ట్రంప్ బృందం జాత్యహంకార వ్యాఖ్యలతో కూడిన పోస్టర్‌ను విడుదల చేసింది. హాలీవుడ్ సినిమా 'ట్రాన్స్‌ఫార్మర్' దృశ్యాన్ని ఉపయోగించి, తలపాగా ధరించిన వ్యక్తికి రోబో ఎదురుగా నిల్చొని, "మిస్టర్ సింగ్.. మా రోడ్లను వదిలిపెట్టండి. మీకు వాహనాలు నడపడం రాదు" అని హెచ్చరిస్తున్నట్లు పోస్టర్‌లో ఉంది. "మీ అంతట మీరుగా దేశాన్ని వీడండి లేకపోతే మేం గుర్తిస్తాం" అని అధికారులు పేర్కొన్నారు. అమెరికాలో ట్రక్కు డ్రైవర్లలో సింగ్ పేరుతో ఉన్నవారు ఎక్కువ. ఈ పోస్టర్‌పై పలు హిందూ అమెరికన్లు, సిక్కుల సంఘాలు తీవ్ర విమర్శలు చేస్తూ, ఇది వివక్షాపూరితమని, దీనిపై దర్యాప్తు జరగాలని డిమాండ్ చేస్తున్నాయి.