
హైదరాబాద్‌లోని ముస్లింలు నా వల్ల కోటీశ్వరులయ్యారు: CM చంద్రబాబు (VIDEO)
AP: విశాఖలో మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్ అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చానని, ఓల్డ్ సిటీ పక్కనే దూరదృష్టితో ఎయిర్‌పోర్టు, ఔటర్ రింగ్ రోడ్ నిర్మించడంతో అక్కడి ముస్లింలు కోటీశ్వరులయ్యారని అన్నారు. హైదరాబాద్ బిర్యానీ, ముత్యాల ప్రాచుర్యాన్ని ప్రపంచవ్యాప్తంగా పెంచింది తన పాలననేనని చెప్పారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌ను నిజాం సంస్కృతిని కాపాడేందుకు విలాసవంతమైన హోటల్‌గా మార్చామని గుర్తుచేశారు.




