అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాలనపై అమెరికన్లలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. తాజా సర్వేల ప్రకారం, 242 రోజుల పాలన తర్వాత ట్రంప్ రేటింగ్ 17 శాతానికి పడిపోయింది. సుంకాల విధానాలు, విదేశాంగ విధానం, వలస విధానాలు, విద్యా సంస్థలపై లక్ష్యాలు వంటివి ఆయన ప్రజాదరణ తగ్గడానికి కారణాలని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ది ఎకనామిస్ట్ నివేదిక ప్రకారం, 39% మంది మాత్రమే ట్రంప్ పనితీరును ఆమోదిస్తుండగా, 56% మంది అసంతృప్తి వ్యక్తం చేశారు.