నేడు హైదరాబాద్‌కు చేరుకోనున్న అమిత్ షా

14చూసినవారు
నేడు హైదరాబాద్‌కు చేరుకోనున్న అమిత్ షా
TG: కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం రాత్రి హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన తెలంగాణ బీజేపీ కీలక నేతలతో సమావేశం కానున్నారు. త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికల కార్యాచరణతో పాటు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై నేతలతో అమిత్ షా విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. ఆదివారం రోజున తూప్రాన్‌‌పేట్, కరీంనగర్‌లలో అమిత్ షా పర్యటించి, అక్కడ ఏర్పాటు చేసిన పలు అధికారిక, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

సంబంధిత పోస్ట్