మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లతో ఫ్యాటీ లివర్ సమస్య పెరుగుతోంది. కాలేయాన్ని శుభ్రపరచడంలో ఉసిరి రసం, గోధుమ గడ్డి రసం రెండూ మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఉసిరి రసం కొవ్వును కరిగించి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గోధుమ గడ్డి రసం క్లోరోఫిల్‌తో లివర్‌ను డిటాక్సిఫై చేసి, ఎంజైమ్‌లను సమతుల్యం చేస్తుంది. నిపుణుల ప్రకారం, ఫ్యాటీ లివర్‌కు ఉసిరి రసం కొంచెం ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది. ఉదయం ఖాళీ కడుపుతో 15 మి.లీ గోధుమ గడ్డి రసాన్ని గోరువెచ్చని నీటితో తీసుకోవడం మంచిది.