గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) ఈ నెల 22 నుంచి 700కి పైగా ఉత్పత్తుల ధరలను తగ్గిస్తుందని ప్రకటించింది. జీఎస్‌టీ కోత ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించడమే దీని లక్ష్యం. దీంతో అమూల్ బ్రాండ్ ఉత్పత్తులపై ధరలు రేపటి (సోమవారం) నుంచి తగ్గనున్నాయి. 100 గ్రా వెన్న రూ.62→₹58, లీటర్ నెయ్యి ₹650→₹610, ప్రాసెస్డ్ వెన్న (కిలో) ₹575→₹545, 200 గ్రా ఫ్రోజన్ పన్నీర్ ₹99→₹95కు తగ్గుతాయి.