నాపై హత్యాయత్నం చేశారు: కౌశిక్ రెడ్డి

14చూసినవారు
నాపై హత్యాయత్నం చేశారు: కౌశిక్ రెడ్డి
తనపై హత్యాయత్నం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఈ కుట్ర వెనుక సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉన్నారని ఆయన ఆరోపించారు. ప్రజల పక్షాన మాట్లాడటం వల్లే తనను లక్ష్యంగా చేసుకున్నారని, తన హత్యకు రెక్కీ జరుగుతోందని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. కరీంనగర్‌లో శాంతిభద్రతలు అడుగంటిపోయాయని, గన్‌కల్చర్ పెరిగిందని, దొంగలను పట్టుకోలేకపోతున్నారని ప్రశ్నించినందుకే తనపై దాడికి పాల్పడ్డారని ఆయన విమర్శించారు. రేవంత్, బండి సంజయ్‌లు కలిసిపోయారని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్