తీర్థయాత్రలో తప్పిపోయిన వృద్ధుడు.. కలిపిన చాట్‌జీపీటీ

10599చూసినవారు
తీర్థయాత్రలో తప్పిపోయిన వృద్ధుడు.. కలిపిన చాట్‌జీపీటీ
పంజాబ్‌కు తీర్థయాత్రకు వెళ్లిన మతిమరుపు సమస్యతో బాధపడుతున్న చమన్ లాల్‌ (వృద్ధుడు) కుటుంబం నుంచి తప్పిపోయారు. రైల్వే స్టేషన్‌కు వెళ్లిన ఆయన పొరపాటున బిహార్‌ రైలు ఎక్కి గయలో దిగారు. అయోమయంలో ఉన్న ఆయనను గుర్తించిన నీరజ్‌ అనే స్థానికుడు నాలుగు రోజుల పాటు ఆశ్రయం కల్పించారు. చమన్ లాల్‌ చెప్పిన ఫతేగఢ్‌ గుజ్రాన్‌ గ్రామం ఎక్కడుందో తెలుసుకునేందుకు నీరజ్‌ చాట్‌జీపీటీ సాయం తీసుకున్నారు. మూడు రోజులు సెర్చ్ చేశాక అది పంజాబ్‌లోని లూధియానా జిల్లాలో ఉందని గుర్తించారు. అనంతరం వృద్ధుడిని వెంటబెట్టుకుని పంజాబ్‌కు వెళ్లి, స్థానికుల సాయంతో కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్