TG: రాష్ట్ర అప్పుల అంశంపై మంత్రి జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ మధ్య సవాళ్లు తెలంగాణ రాజకీయాల్లో ఉద్రిక్తతకు దారితీశాయి. చర్చకు వస్తానన్న జూపల్లి కోసం బీఆర్ఎస్ నేతలు తెలంగాణ భవన్‌లో ప్రత్యేకంగా ఆయన పేరుతో కుర్చీ ఏర్పాటు చేసి ఎదురుచూశారు. అయితే జూపల్లి నేరుగా గన్‌పార్క్‌కు వెళ్లి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు అక్కడికే వచ్చి చర్చించాలని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ తెలంగాణ భవన్ నుంచి గన్‌పార్క్‌కు పాదయాత్రగా బయలుదేరగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తెలంగాణ భవన్ వద్ద తోపులాట, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.