సీఎం విజయ్‌పై చేయి వేసి.. ఫొటో దిగిన వృద్ధురాలు

22చూసినవారు
తమిళనాడు సీఎం విజయ్‌ పాల్గొన్న సంక్షేమ కార్యక్రమంలో ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. స్వయం సహాయక సంఘాల బలోపేతానికి ప్రభుత్వం రూ.1,110 కోట్ల బ్యాంకు రుణాలు మంజూరు చేసింది. ఈరోడ్‌ జిల్లా పెరందురైలో లబ్ధిదారులకు చెక్కులు అందించిన విజయ్‌.. మహిళలతో ఆత్మీయంగా ముచ్చటించి ఫొటోలు దిగారు. ఓ వృద్ధురాలు ఆయన భుజంపై చేయి వేసి ఫొటోకు పోజివ్వగా, పలువురు మహిళలు తమ ఐడీ కార్డులపై ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు. మరికొందరు థంబ్స్‌ అప్‌, హార్ట్‌ సింబల్స్‌ చూపించాలని కోరడంతో విజయ్‌ సరదాగా స్పందించారు.

సంబంధిత పోస్ట్